Saturday, January 6, 2018

మినీ కవితలు...



ఒక విజేత స్వీయచరితము
--------------------
గతించిన గతం అంత ఒక జ్ఞాపకము
వర్తమానము దాని ప్రభావాల కొనసాగింపు
 భవిష్యత్తు ఈ రెండు కలయిక అనుభవం తో పొందే విజయశిఖరం
ఇదే ఒక విజేత స్వీయచరితము
దృక్పథము
---------
చచ్చిపోతున్నా కూడా వైద్యం చేయనివి గవర్నమెంటు ఆసుపత్రులు
 చచ్చిపోయినాక కూడా వైద్యం చేసేవి కార్పొరేట్ ఆసుపత్రులు

చచ్చిపోతున్నా తెలుగుని బ్రతికించాలని ప్రభుత్వపాఠశాలలు
ఎక్కడ బ్రతికేస్తుందో తెలుగు , దానిని ఎలాగైనా చంపేయాలని ప్రయివేటు పాఠశాలలు

ఈ రెండు దృక్పథాలు మారితే గాని ఈ దేశం బాగుపడదు

నేతలు
---------
నవ వసంతానికి
నాంది పలకాలని,
అనుక్షణం శ్రమించిన
నేతలందరికీ వందనం
అభివందనం

నేతలంటే కాదు
నేటి మేటి మేతలు
అధికారం కోసం
అర్రులు చాచే
అక్కుపక్షులు

నేతలంటే వారు
అవకాశం, అధికారం
ఉన్నా ప్రజల కోసం
పోరాటం చేసి
పరమపదించిన వారు
  
 వాస్తవం
-------

నయానో భయానో
నయవంచన

అంగీకరిస్తే అందలం...

ఆజ్ఞను నిరాకరిస్తే
అధ:పాతాళం...

ఇదే నేటి అహంకార
అధికారతత్వం !