Saturday, October 14, 2017

భార్య


ఈ మధ్య వాట్సాప్ లోను ,ఫేస్ బుక్ లోను భార్యాల మీద కార్టూన్లు, జోక్స్ వస్తుంటే చూసి నేను నవ్వు కున్నాను , ఎందుకో వాళ్ళ కోసం ఆలోచిస్తే ఇలా అని పించింది
----------------------------------------
" Inter-dependency is much better than In-dependency "

ఆడిపోసుకోడానికి అంటాం కానీ ,

అలి లేని నాడు వేలు కూడా కదపలేము,

మనం ఉద్యోగాలు చేసి ఉద్దరించేస్తాము అనుకుంటాము కానీ

సంసారాలు వాళ్ళు చక్కదిద్దక పోతే చతికల పడిపోమా

కొట్టుకుంటూనే కలిసి ఉంటాము ,

తిట్టుకుంటూనే తిరుగుతుంటాము,

పార్వతి ని వదిలి ఉండలేని పశుపతి కన్నా ,

లక్ష్మీ ని వదిలి ఉండలేని వేంకటేశ్వరుడి కన్నా,

గొప్పవల్లమా , ఫాలో అయి పోదాం దేవుళ్ళు నే ,

బ్రతికేద్దాము భార్య చాటు భర్తలే, భర్త చాటు భార్యలై , సుఖంగా ,సంతోషంగా...

Sunday, October 8, 2017

ప్రకృతి ప్రేమ




ఆకాశము అంచు ఎక్కడో సముద్ర గర్భాన్ని చుంబించింది

ఆ పులకింతకు నీటి బిందువులు అవిరులై ఆకాశన మేఘాలు గా మారిపోయాయి

ఆ మేఘాలను మలయామరుతం మోహించింది ,తన చల్లని స్పర్శ తో స్పృశించింది

తమ ప్రేమకు గుర్తుగా , చిరుజల్లులను పుడమి ఒడిలో దోసిళ్లతో నింపేసాయి

అక్కున చేరిన ఆ నీటి జడివానను , తమలో మమేకం చేసుకున్నాయి , చెట్లు చెమలు

భూమి తనతో కలిసిన కలయికకు గుర్తుగా , ఉదయభానుడి సాక్షిగా ఎన్నో పూలు , ఫలాలను అందించింది ఆ చెట్లకు

వాటిని సేవించిన మనిషికి మరి తెలియదా ప్రేమకు ప్రతిరుపమే ఈ ఫలహారం అని ఆ మనిషి కడా విశ్వప్రేమకు ప్రతిరూపం...