తలపు
అలిసి సొలసి ఒత్తిగిల్లిన
రోజు లీలగా నీ ఊసు గుర్తొస్తుంది
అయినా మగత తీరక, మాట వినని తలపునాపలేనేమో
తనవి కావంటూనే కలల్ని పదిలంగా
దాచుకుంటుంది
తడారిన కళ్ళకి ఎప్పుడో రాసిచ్చిన
వీలునామా ఏమో
చెంపలపై ఆవిరైన కన్నీటి చారికల
ఉనికి తెలుస్తుంది
తెలియకుండా ఎర్రటి సిగ్గును
కప్పేస్తున్నాయో ఏమో
తెలియని తలపు దారిలో మనసేదో
వెతుకుతుంది
కాసేపాగండని చెప్పే చనువు లేదో ఏమో
ఉక్కిరి బిక్కిరి చేసిన ఊహలనుండి
మనసు ఉలిక్కిపడింది
నిద్దట్లో మెలకువలా నువ్వొచ్చెళ్ళావో
ఏమో
PC Source:Google
2 comments:
👌👌
Post a Comment