Sunday, June 18, 2017

మా నాన్నకు ప్రేమతో ...




నాన్న నా చేతి ని పట్టుకొని ఈ లోకాన్ని చూపినవాడు...

మన సుఖసంతోషాల కోసం తన ఇష్టాలను కూడా త్యాగం చేసేవాడు...

మనము ఏదైనా సాధిస్తే నలుగురికి చెప్పి సంతోషించే వాడు...

ఓటమితో బాధపడుతుంటే నీకోసం నేనున్నాను అని ఓదార్పు ఇచ్చేవాడు...

తాను ఏమిచేసిన ఇది పిల్లలకి ఏవిధంగా పనిచేస్తుంది అని అనుక్షణం ఆలోచనలుతో సతమతమయ్యెవాడు...

ఒక నాన్న విలువ తెలియాలంటే నువ్వు నాన్న అయితే కానీ తెలియని ఒక గొప్ప త్యాగశీలి...

ఒక కష్టం వచ్చిందంటే తన పిల్లలు ఎలా ఎదుర్కుంటారో ఎదురు చూసి సమస్యా మనం పరిష్కరింస్తే సంతోష పడిపోతాడు, లేక పోతే తానే సమస్యకు సమాధానమే నిల్చుంటాడు...

అమ్మ అంత ఆప్యాయంగా నీతో మాట్లాడక పోయిన, అమ్మకి మించిన ప్రేమ నీ మీద మనసులోనే దాచుకుంటాడు, ఒక్కసారి అమ్మను అడుగు నాన్న అంటే ఏమిటో చెప్తుంది...

బజారుకు వెళ్లే ముందు భాద్యతలు చెప్తాడు, వెళ్లిన తరువాత నీకు నచ్చింది అంటే అది ఎంత భారం అయిన నీకోసం సులువుగా మోసేస్తాడు...

అమ్మ కళ్ళలో చూపిన ప్రేమ, నాన్న గుండెల్లో దాచుకుంటాడు ,అమ్మ చూపించినా ఆప్యాయతను నాన్న భాద్యత లో చూపిస్తాడు...

నాన్న నువ్వే నా భవిష్యత్తు కి బంగారు బాటవి, నా మొట్టమొదటి స్నేహితుడివి, గురువువి...

మా నాన్నకు ప్రేమతో ...

Wednesday, June 14, 2017

అశ్రు నివాళి తో Dr. సి నా రె గారికి...




కళ్ళు రెండు చూడటానికే , కాళ్ళు రెండు నడవడానికే,

కళ్ళు రెండు కలహించుకుంటే,

కాళ్ళు రెండు కలిసి నడవకుంటే,

ఇంకెక్కడి దృశ్యం, ఇంకెక్కడి గమ్యం,

తెలుగు దేశంలో పుట్టి, తేట తెలుగుతోనే పెరిగి, ఇంతటి ఔన్నత్యాన్ని, ఉన్నతిని తెలుగు ద్వారా పొంది,

నీ సాహిత్య ప్రతిభతో సాహిత్య అకాడమీ అవార్డుని సొంతం చేసుకొని, నీ పదబంధాలతో పద్మశ్రీ ని పొంది, నీ జ్ఞానానికి పరిపాటి జ్ఞానపీఠ్ అనేలా చేసి, తెలుగు కవితా లోకంలో పద్మభూషనుడై భాసిల్లిన నువ్వు

నేడు నీ కనుల ముందే తెలుగుకి ఈ స్థితి వస్తే చూడలేక, తెలుగు చచ్చిపోయే దుస్థితే వస్తే దాని కంటే ఒక్క రోజు ముందు నేను చనిపోతాను అని మౌనంగా నీ గమనాన్ని మరణము వైపు మరలించావా

మరణము నీ దేహానికి కానీ నీ పాటకూ, కవితకూ, మా కోసం నువ్వు వదిలి వెళ్లే నీ ఏ కళకూ లేదు.

ఓ మహునుభావా, ఓ మహా మనిషీ, మా తెలుగుతల్లి ముద్దుబిడ్డ ఓ సి నా రె...

నీకు ఇదే మా ఆశ్రునివాళి...


( జననం: 29 July 1931--- మరణం: 12 June 2017)
 

Saturday, June 3, 2017

Indonesia - జలపాతాలు





అద్భుతము, ఆహ్లాదము, సాహసం, అనిర్వచనీయము ఆ అనుభవము

ఎక్కడ నుంచో కొండలు , కోనలు దాటి , ఎన్నో అడ్డంకులు అధిగమించి, కొన్ని వేల ఔషధ మొక్కలను స్పృశిస్తూ , ఎన్నో జంతుజాలలకు దాహార్తిని తీర్చుకుంటు , మరెంతో మంది కోసం పయనిస్తూ మార్గమధ్యంలో మకోసం ఒక మజిలీ ఏర్పరిచి ,

పాల నూరుగలకు పర్యాయపదంలాగ జలపాతములు జాలువరుతుండగా, నఖా శిఖా పర్యంతం తనువు తడిసి పరవశించిన వేళా , ఆ చల్లని నీటి బిందువులు ఒక్కోకటిగా ఐక్యమత్యంతో కలిసి హోరు జలపాతం అయి శిరస్సును తాకినప్పుడు ఆ అనుభవం వర్ణనాతీతం

లక్షల మంది దాహార్తిని తీరుస్తూ, వందల ఎకరాల పంట పొలాలను సస్యశ్యామలము చేస్తూ , జనులకు అవసరమగు జల విద్యుత్ ను ఉద్భావింపజేస్తూ సాగిపోయే ఆ పయనం

ఒక్క మునకతో ఆ అమృత గంగలో బాహ్య ప్రపంచపు బడలికలు మరచిన ఆ క్షణం

చేసినా ఆ చిన్న ప్రణాళిక బద్దమైన సాహసము వల్ల ఏటువంటి ప్రమాదాన్ని కూడా స్పృశించక , అనుభవించినా ప్రమోదం ఆమోగం

విజ్ఞానంగా మనము ఎంత ఎత్తుకు ఎదిగిన , ప్రకృతికి ప్రత్యన్నయంని సృష్టించాలంటే ఇంకా ఎంతో సాధించాలని ఆ జలపాత హోరు లో చెప్తున్నా వైనం

ఆటవిడుపుకి ఆనవాళ్ళుగా, కొండ కోనల్లో పయనిస్తూ , ప్రకృతి ఓడిలో సేదతిరి , ని చల్లని మదిలో శయనించిన వెళ ఆ అనుభావం కవుల మాటలకందనిది , చిత్రకారుల ఉహకు చిక్కనిది

జాలువారుతున్న పాలనురుగల ప్రవాహం ఒక ఎత్తు అయితే , పచ్చని చెట్ల మధ్య పెట్టని ప్రాకారపు అమరికలు మరొక ఎత్తు ,

నేను చూసిన అద్బుత అందాలలో (మొదటి మంచు శిఖరం మనాలి, ప్రేమకు చిహ్నం తాజ్ మహల్ , హరిద్వార్ రుషిఖేష్ ల గంగ ప్రవాహం , అమృతసర్ స్వర్ణ దేవాలయం , ఢిల్లీ లోటస్ టెంపుల్, అక్షరాదమము ) ని స్థానం పదిలం, సుస్థిరం

మన ఉగాది




మన ఉగాది...

కమ్మని కోయిలల గాన సమ్మేళన నిధి --- మన ఉగాది

లేలేత పూబాలల అంకురార్పణ ఆరంభగాడి --- మన ఉగాది

పాత కొత్తల సమ్మేళనానికి సంవారధి --- మన ఉగాది

పంచాంగ పఠన, శ్రవణాలను ప్రపంచానికి పరిచయం చేసే ఆది తిధి --- మన ఉగాది

షడ్రుచుల సమ్మేళనంతో జీవితసారాన్ని సరళముగా తెలియజెప్పిన పరమావధి --- మన ఉగాది

మన తెలుగు వారి తొట్టతొలి పండుగకు ఆనావళి --- మన ఉగాది

కన్నడ,కొంకణి,బాలి,మరాఠీ,తెలుగు వాళ్ళ సంస్కృతీ, సాంప్రదాయాల సారుప్యతకు సాక్ష్యం --- మన ఉగాది

ఆరంభానికి ముహూర్తం అక్కరలేని పరమపవిత్ర తిధి --- మన ఉగాది

ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందము, ఉత్సాహం, బాధ, ఓర్పు, నేర్పు, సహనం, సవాళ్ళు ఉంటాయని వాటిని రుచి చూసిననాడే గమనం, గమ్యం అనిసహేతుకంగా చెప్పిన సాంప్రదాయం --- మన ఉగాది

ఈ ఉగాది పరమ దినమున ఎంత సంతోషంగా గడిపారో అదే విధంగా జీవితాంతం ఉండాలని కోరుకుంటూ

మీ సాటి,తోటి తెలుగోడు...