Friday, August 25, 2023

భూమి చంద్రుని తో


 ఎంత మందికి స్ఫూర్తినిచ్చావు

ఎన్నెన్ని కవితలు, కథలు , కందపద్యాలు, యుగళ గీతాలు, విరహ తాపాలు, గజళ్లు, అవధానాలు...

అసూయ కలిగేది నిన్ను చూస్తుంటే. 


ఇప్పుడు నీ వంతు సుమా!

తెల్లని మబ్బుల మాటు నుంచి నీలి వర్ణాలను, అక్కడక్కడ పచ్చని ఛాయలను ఎలా వర్ణిస్తావో...


దూరం తగ్గింది, దారులు పడ్డాయి. పల్లెటూరు లాగా పదే పదే కలుస్తామో, లేక పట్టణాల లాగా పలకరింపు కూడా కరువు అవుతుందో...


ఎంత త్వరగా నా భారం తగ్గించి తరువాత తరానికి ఆతిథ్యం ఇస్తావో.

ఆశ తో ఎదురు చూస్తూ...


నీ అవని


✍️ శ్రీ ✍️

24.08.23.

నీ మీద కాలు పెట్టిన క్షణం


నీ మీద కాలు పెట్టిన క్షణం

నూతన శకానికి నాంది పలికి, ఆశల అంచులు మరింత పెంచిన భాద్యతాయుతమైన క్షణం.


నీ మీద కాలు పెట్టిన క్షణం

140 కోట్ల భారతీయుల ఆనందం తో మొదటిసారి భూమి మీద కాలు మోపక గెంతులేసిన  క్షణం


నీ మీద కాలు పెట్టిన క్షణం

ప్రపంచానికి కలలు కనడం నేర్పిన స్వాప్నికుడి ఒక కల నెరవేరిన అధ్బుత క్షణం


నీ మీద కాలు పెట్టిన క్షణం

దృఢ సంకల్పం ఉంటే అసాధ్యాలు సైతం సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన క్షణం 


నీ మీద కాలు పెట్టిన క్షణం

ఇన్నేళ్ళ దూరపు చుట్టరికానికి, రాక పోకలు మొదలు పెట్టిన మధుర క్షణం.


✍️ శ్రీ ✍️
24.08.23.