ఒక విజేత స్వీయచరితము
--------------------
గతించిన గతం అంత ఒక
జ్ఞాపకము
వర్తమానము దాని
ప్రభావాల కొనసాగింపు
భవిష్యత్తు ఈ రెండు
కలయిక అనుభవం తో పొందే విజయశిఖరం
ఇదే ఒక విజేత
స్వీయచరితము
దృక్పథము
---------
చచ్చిపోతున్నా కూడా
వైద్యం చేయనివి గవర్నమెంటు ఆసుపత్రులు
చచ్చిపోయినాక కూడా
వైద్యం చేసేవి కార్పొరేట్ ఆసుపత్రులు
చచ్చిపోతున్నా తెలుగుని
బ్రతికించాలని ప్రభుత్వపాఠశాలలు
ఎక్కడ బ్రతికేస్తుందో
తెలుగు , దానిని ఎలాగైనా చంపేయాలని ప్రయివేటు పాఠశాలలు
ఈ రెండు దృక్పథాలు
మారితే గాని ఈ దేశం బాగుపడదు
నేతలు
---------
నవ వసంతానికి
నాంది పలకాలని,
అనుక్షణం శ్రమించిన
నేతలందరికీ వందనం
అభివందనం
నేతలంటే కాదు
నేటి మేటి మేతలు
అధికారం కోసం
అర్రులు చాచే
అక్కుపక్షులు
నేతలంటే వారు
అవకాశం, అధికారం
ఉన్నా ప్రజల కోసం
పోరాటం చేసి
పరమపదించిన వారు
వాస్తవం
-------
నయానో భయానో
నయవంచన
అంగీకరిస్తే అందలం...
ఆజ్ఞను నిరాకరిస్తే
అధ:పాతాళం...
ఇదే నేటి అహంకార
అధికారతత్వం !
1 comment:
Correct...
Post a Comment