నేనొక మట్టి ముద్దను, నీ చేతులతో సృష్టిస్తానంటే ఏ ఆకృతి నైనా నాలో మలుచు కునే మగువను
నేనో కొన్ని నీటి చుక్కల సమూహాన్ని, నీ రూపాన్ని సంతరించుకునే సహజత్వాన్ని...
నేనొక బీజాంకురాన్ని, నీ ప్రేమ మమకారాల కలయికతో నీ వంశ వృక్షాన్ని నిలబెట్టే అమ్మతత్వాన్ని
నేనొక చిట్టి నేస్తాన్ని, నీతో పాటూ అన్ని పంచుకుంటూ, అనుబంధాన్ని పెంచుకునే అక్కా చెల్లిని...
నేనొక ప్రేయసిని, నీ కోసం అనుక్షణం పరితపించే, అహర్నిశలు నీ ఆలోచనలతో బ్రతికే చెలిని...
నేనొక అమ్మని, నా పిల్ల ల అల్లరి చేష్టలకు ఆట బొమ్మను...
నేనొక ఒక లతను, బంధాలను, బాధ్యతలను ప్రేమగా అల్లుకుంటూ మీతో, మీ కోసమే బ్రతికే ఇల్లాలిని...
వెరసి ఆది నుంచి అంతం వరకు రూపాంతరాలు చెందుకుంటూ రూపురేఖలు మారుతున్న మీ కోసం... బ్రతుకుతూ, నా వాళ్ళ కోసమే అనుకునే నేనొక స్త్రీ మూర్తిని...
1 comment:
Superb annaya
Post a Comment