నాన్నకు బడ్జెట్ లో వంట అయిపోవాలి
అన్నకు నాన్ వెజ్ కావాలి
అక్కకు ఆకుకూరలు కావాలి
తాతయ్యకు రుచి బాగుండాలి
నాన్నమ్మ కు ఇగురు ఎక్కువ కావాలి
ఇంటిల్లపాదికీ సమయానికి వంటవ్వాలి
తడిసిన కట్టెలు త్వరగా అంటుకోవు
అంటుకున్నాక పొగకు నీ కళ్ళలో కన్నీళ్లు ఆగవు
వంట చేస్తూ బట్టలు ఉతకక పోతే సమయం సరిపోదు
ఇన్ని చేశాక, ఎన్ని వంకలు, ఎన్ని మాటలు
నీకు మిగిలిందో లేదో, తిన్నావో లేదో,
నీకు మాత్రమే తెలుసు
చేతులు కడగక ముందే రాత్రికి ఏంకూరని మళ్లీ ఒక ప్రశ్న
అది నీ బుర్రలో బొంగరం లా తిరుగుతూనే , బియ్యం ఏరుకుంటూ, వీధిలో ఊసులు వింటూ, ఒక్క క్షణం కూడా నడుము వాల్చని నీ తలరాతను తిట్టుకుంటూ
రాత్రి వంట కోసం మళ్లీ కసరత్తు
ఆ వంట గదిలో పరిచారికలు లేని పట్టపు రాణివి
ఈ సాగిపోతున్న కాలానికి అలుపెరుగని గడియారానివి
ఎప్పుడో మా తాత నిన్ను మా నాన్న కు యవ్వనవతిగా ఈ ఇంటికి పంపాడట
ఇప్పుడు ముసలి అవ్వగా మరి ఆ వంట గదిలో నుంచి వస్తున్న నిన్ను చూస్తున్నాను
అమ్మా నీకు జోహార్లు మాటలయితే చెప్పగలను కానీ చేతల్లో ఏమి చేయగలను
చెయ్యెత్తి నమస్కరించడం తప్ప
అమ్మా నీకు జోహార్లు....
2 comments:
చిన్ననాటి రోజులు గుర్తు చేశారు, కట్టెల పొయ్య వంటల రుచే వేరు
Thank you
Post a Comment