Wednesday, December 4, 2019

పుస్తకము - ఒక బహుమతి




ఏ విలువైన వస్తువునో బహుమతి గా ఇచ్చి
భావితరాల భవిష్యత్తును ఖరీదుకు తూకం వెయ్యడం నేర్పద్దు ...

ఒక నచ్చిన , నువ్వు మెచ్చిన పుస్తకము ఒకటి ఇవ్వు
ఏమో ఏ అక్షరం ఏ అనంత విజయాలకు ఆజ్యం పోస్తుందో
ఏ పదం తన భవిష్యత్ పధగతులను మారుస్తుందో...
నువ్వు ఇచ్చిన పుస్తకాల అక్షరాలు మలిచిన మనిషి
 ఎంతో మందికి ఆదర్శం అయిన నాడు
నీకే తెలియని ఒక బహుమతి అవుతాడు ...

నువ్వు ఇచ్చింది ఒక బహుమతి కాదు
ఒక చక్కని చెలికాడు, మహోన్నత మార్గదర్శి అని తెలిసిన నాడు
ఆ మనిషే మహనీయుడు అవుతాడు ...

తనని తాను నియంత్రించుకోలేనప్పుడు
అక్షరాలే నియంతలై నియమాలు నేర్పుతాయి
మనసు బాగా లేనప్పుడు తన మనోఫలకం మీద
 మరపురాని ముద్రలు వేస్తాయి...

గతించిన గత చరిత్రల ఆనవాళ్లు కావాలన్నా
కీర్తి సాధించిన మహోన్నతల స్వీయచరిత్రలు కావాలన్నా
అంతెందుకు నువ్వు చెప్పాలన్న  నాలుగు మాటలకు వారధి ఆ పుస్తకం ...

విజ్ఞాన అంచులను తాకాలన్నా
 కవుల రసస్పందనలను రుచి చూడాలన్నా
 రంగమేదైనా దాని దరి చేరాలంటే  ఉత్ప్రేరకాలు ఈ పుస్తకాలే...

అమ్మ మాటలు కరువైన అనాథ కైనా
నాన్న లాలన ఎరుగని గతాన్ని అయిన
                    కప్పిపుచ్చగల సహృదయ స్నేహితుడు ఆ పుస్తకమే...

No comments: