Wednesday, December 4, 2019

మరణం...





మరణం అంటే చాలు బయపడి పోతాము
మన కాల గమనము ఏదో ఆగినంట్లు
ఎవ్వడు మాత్రము ఉండిపోతాడు విశ్వంతరం వరకు...


మరణం అంటే చాలు బయపడి పోతాము
మనము ఏదో తీసుకొచ్చి ఈ జగత్తు   కిచ్చినంట్లు
మళ్ళి తీసుకెళ్ళకుండా మరిచిపోయినంట్లు...


మరణం అంటే చాలు బయపడి పోతాము
మనతో మనము చేసే
నిత్య రణమే మరణం అని తెలుసుకునేదేప్పుడు...



మరణం అంటే చాలు బయపడి పోతాము
 నిదుర లేని రాత్రులు గడిపేస్తాము , నిస్తేజంగా బ్రతికేస్తాము
                                 మరణం అంటే శాశ్వత నిద్ర అని తెలుసుకునేదేప్పుడు

No comments: