భగవంతునికి భక్తులం
ఏదో ఒక మతానికి ఆప్తులం
చదువుకున్న విజ్ఞానులం
మాయలు, మంత్రాలు నమ్మే మూర్ఖులం
అభివృద్ధి కోసం మాట్లాడుకుంటాం
అమలు చెయ్యాలంటే కొట్టుకుచస్తాం
అన్ని తెలిసిన మేధావులం
ఏమి చెయ్యని దద్దమ్మలం
తల్లిదండ్రులను ప్రేమించే దేశమంటాం
వృద్దాశ్రమాలు వృద్ది చేస్తాం
కుటుంబ విలువలు కోసం మాట్లాడతాం
ఒక్కటిగా ఉండటానికి ఇష్టపడనేపడం
మన సంస్కృతీ, సంప్రదాయాలను తెగ పోగిడేస్తాం
పాశ్చాత్య పోకడలకు బానిసలైపోతాం
ఎదురుగా ఉంటే మాట్లాడుకోం
అంతర్జాలములో ఆప్యాయత ఒలకబోస్తాం
విలువలు కోసం అనర్గళంగా మాట్లాడేస్తాం
ఆ విలువలకి వలువలు విప్పి యధేచ్ఛగా తిరిగేస్తాం
ఎదుటి వాడికి నీతులు చెప్పేస్తాం
మనము పాటించవలసి వస్తే లోకజ్ఞానం బోధిస్తాం
పల్లెటూర్లను ప్రేమిస్తాం
ఒకసారి పట్నం వస్తే మళ్ళీ వెనుదిరిగి చూడం
బలవంతులమని బాహాటంగా ప్రకటించుకుంటాం
కులం, మతం,ప్రాంతం
ఏదో ఒక అండ లేకుండా బ్రతకలేని బలహీనులం
రూల్స్ మనమే సృష్టిస్తాం
అంతకుముందే వాటిని పాటించకపోవడానికి దారులు
వెతికేస్తాం
ఓటు వేసినప్పుడు సారాయి, నోటుకి
అమ్ముడుపోతాం
గెలిచినవాడు పాలన చూసి తిట్టుకుంటూ బ్రతికేస్తాం
నవ భారత నిర్మాతలం అని చెప్పుకుంటాం
ఆ నిర్మాణాలలోనే అవినీతికి పాల్పడతాం
వివేకానంద , అబ్దుల్ కలాం ను అభిమానిస్తాం
వారి మార్గంలో నడవడమే అసాధ్యం అంటాం
దేవతలను పూజిస్తాము
ఆడవాళ్ళను అవమానిస్తాము
ప్రపంచ దేశాలకు జ్ఞానం నేర్పింది మనమే అంటాం
వారి దేశాల్లో పనిచెయ్యడానికి వరుసలో ముందుగా
నిలబడిపోతాం
ఇదే మన అర్ధం కాని సగటు భారతీయుని మనస్తత్వం
ఇదే నేటి నవ భారతనికి వారసత్వం
No comments:
Post a Comment