అవిశ్రాంత శ్రామికురాలివి
అలుపెరుగని నా సహధర్మచారిణివి
ఏదో సాధించాలని ఉద్యోగం ఒకవైపు
ఒక మంచి గృహిణిగా కుటుంబం కోసం ఉద్వేగం మరోవైపు
ఈ గమనంలో నీకు నువ్వుగా తీసుకోవు విశ్రాంతి అని ఏమో
అసంకల్పితంగా ఆ దేవుడే కల్పించాడేమో లిగ్మెంట్ టీఆర్
ప్రతి పరాజయం ఒక రాబోయే గెలుపుకి పాఠం
ప్రతి ప్రమాదం ఒక ప్రమోదదానికి నాంది
వినియోగించుకో ఈ విశ్రాంతి సమయాన్నీ
నీ భవిష్య కార్యాచరణలకు కరదీపికలై
ఏమి జరిగినా మన మంచికే అన్న నానుడికి సార్ధకత చేకూర్చు మరొక్కసారి
కదపకూడనిది నీ కాలే కానీ లక్ష కోట్ల కణాలు ఉన్న నీ మెదడును కాదు
ఆలోచనల అంతర్మథనం కానివ్వు అద్భుత ఆవిష్కరణలకు ఆజ్యం పొయ్యు
ఈ లిగ్మెంట్ టీఆర్ నీ మన హ్యాపీ లాంగ్ లివింగ్కి పునాదిగా ఉపయోగించు
No comments:
Post a Comment