Tuesday, January 9, 2018

మానవ జన్మ...




నిదురిస్తే తెల్లారి లేస్తావో లేదో తెలియని
ప్రతిరోజూ చస్తూ, పుట్టే అల్ప ప్రాణివి
ఎందుకు రా నీకు అంతటి గర్వం

 బ్రతుకంటే ఎందుకంత ప్రీతి
సృష్టించలేవ బ్రతికునంత వరకు మరో ప్రాణికి ఓ బహుమతి

చెట్టు ,చేమో నాటు , చింత అన్నవాడికి చేయ్యుత నివ్వు
అంతలో నీకు తరిగిపోదు ఆయువు
 పెపెచ్చు పెరుగు పోతుంది ని యశస్సు

అద్భుతాలు చెయ్యాలంటే కానక్కరలేదు అందరు అదృష్టవంతులు
అమ్మ కొడుకు అయిన ప్రతివాడు అర్హుడే

ఉన్నదానిలో నిజయతిగా బ్రతుకు
 నీకు చేతనయిన సాయమేదో చెయ్యు
కారణం లేకుండా మానవ జన్మ లేదు
పుట్టిన ప్రతివాడు కారణజన్ముడే

పుట్టి మమ్ములుగా చస్తానంటే మానవ జన్మ ఎందుకు
పుట్టి పుట్టగానే పుటుక్కు మనే పేడపురుగు అయిన సరిపోతుంది