Wednesday, May 17, 2017

మద్రాస్ ( From 02.12.15 To 03.12.15)



మొదటిసారి మద్యాహ్నము 3.00 గంటలకు ఆఫీస్వదిలేస్తున్నారు అంటే చిన్న వర్షము పడినప్పుడు స్కూల్వదిలేసిన రోజులు గుర్తొచ్చి నవ్వుకున్నాను.

“ Heart of the City - Anna nagar”  అని విన్న నేను,వర్షపు తాకిడికి ఇదే ఇంతలాగా వణికి పోతుంటే మరిమిగతా ప్రాంతాల దుస్థితి ఉహించటానికే భయంగాఉంది.
అంతలోనే whatsapp లో తెలిసింది విమానరాకపోకలు ఆపేసారని... అదే ఉధృతమైన వర్షం వల్ల

అంతలో కరంటు పోయింది సుమారు సాయంత్రం 6.00గంటలకుఇప్పటికీ రాలేదు.. దాదాపు 14.00 గంటలుతరువాత కూడా... మరి ఎప్పుడు వస్తుందో వేచిచూడాల్సిందే...

రాత్రికి భోజనం చేద్దామని గెస్ట్ హౌస్ కి వెళ్దాంఅనుకుంటే వెళ్ళే పరిస్టితి లేదుమోకాళ్ళువరకు  నీళ్ళు,దీనికి కారణము కూడా ధారాపాతము గా కురుస్తున్న వర్షమే.

బ్రతుకు జీవుడా అని  అతి కష్టం మీద బయటపడిఎదురుగా ఉన్న కొట్టులో ఏదో తిని మూడు బిస్కట్ప్యాకెట్లు తీసుకొని రూమ్ కి వచ్చి పడుకున్నాను,తెల్లవారి అయినా తెరిపి ఇస్తుందా అని ఏదోచిన్నఆశతో...

యధావిధిగా 6.00 గంటలకు అలారం మ్రోగింది,అప్రయత్నం గానే నిదురలోంచి లేచిబయట ఒక్కసారిచూస్తే , నా కళ్ళు నేనే నమ్మలేనట్లు నేను అన్ననగర్ లోఉన్నానా లేక అండమాన్ లోనా అని.

మొబైల్ లో ఛార్జింగ్ లేదుఇంటిలో పవర్ లేదుఆకలివెయ్యకా మానదు...

 పరిస్థితికి కారణము పాలకుల పట్టింపు లేని తనము,అధికారుల అధత్వముప్రజల స్వార్ధముకొలనులను,జలపాతాలను,సెలయేరులనుకొండలనుగుట్టలనుఒక్కటేమిటి కంటికి కనిపించిన ప్రతి ఒక్కటి మనసొంతం చేసుకోవాలనే పిచ్చితత్వము

నాడు కబ్జ్జా చేసిన కొలనులుసెలయేరులో వెళ్ళవలసిననీళ్ళు , వర్షాలు వచ్చిన్నప్పుడు నేడు కోలనిలోకివస్తున్నాయిమనిషి మారిపోయాడు ప్రతిదిదోచుకోవడమే పరమావధిగా పెట్టుకున్నాడుపాపంప్రకృతికి ఇవేమీ తెలియవునీరు పల్లానికిప్రవహించాలన్న తన సహజత్వమును తప్ప...

ఏకధాటిగా కురుస్తున్న వానడ్యాము గేట్లు ఎత్తేస్తాముఅన్న అధికారుల ప్రతిపాదనఅర్ధరాత్రి , నిషిది చీకటిలోజలమైమైన వీధులుసంచరించడమే సాహసముగాభావించవలసిన వైనము

రెండు రోజులు ఆధునికయుగంలో విద్యుత్తు లేకుండా గడపడమునాలుగుగోడల గదిరెండు పగలు,రెండు రాత్రులుఛార్జింగ్ లేనిమొబైల్,పవర్ లేని ప్లగ్ లు , చదువుకోటానికి రెండుపుస్తకాలురాసుకోటానికి ఒక నోట్ పాడ్ , క్రమముతప్పని ఆకలి...

మానవత్వానికి బాషలేదని,ఒకరికి ఒకరు సాయముచేసుకోటానికి ఒకేరాష్ట్రము కానక్కరలేదనిగ్రౌండ్ ఫ్లోర్లో తడిసిన సామాన్లుతో ఉండలేకనా రూమ్ లో సేదతీరటానికి నన్ను అడగలేక మొహమాట పడుతున్న ఇంటి  యజమాని మరియు ఆతని కుటుంబముఅదిచూసి నేనే వారిని పైకిరమ్మన్నానుసమయానుసారముగా వారితో పాటుగా నాకు ఆహారాన్ని  అందిస్తూనా బాగోగులుచూసుకుంటున్నారుమొహమాటము తో వారుచేస్తుంది కాదనలేకవేరే దారి లేక అనుసరిస్తున్న నేను...

అప్పుడు అర్ధము అయిందిఋణాను బంధం అంటే పక్కనే అదే నగరంలో ఉన్న చెల్లిని కలవలేకపోయానునాకోసం ఎదురుచూస్తున్న తల్లితోభార్యతో మాట్లాడలేకపోయానుఅంతెందుకు రెండు అడుగుల దూరంలోఉన్న గెస్ట్ హౌస్ కి కూడా చేరుకోలేకపోయాను రెండురోజులు నాకు కుటుంబము,ఆత్మీయులు అన్ని అన్నివాళ్ళే నాతోపాటుగా గడిపిన  తమిళ కుటుంబం...

నా జీవిత కాలములో నేను మరిచిపోలేని అతి కొద్దిరోజుల్లో నాకు తెలియకుండా నానుంచి చెన్నై నగరం వర్షం దోచుకున్న రెండు రోజులు(ఫ్రొం 2.12.2015 తొ3.12.2015) ఎప్పటికి మరచిపోలేనుఎప్పుడు టీవీలోవరదలు,వర్షాలు అంటే చూడడమే గాని ప్రత్యక్షంగాఅనుభవిస్తే తెలిసింది నరకం అంటే ఏమిటి అనిఅయినవారితో మాట్లాడలేనుఆప్యాయముగా పలకరించేవారిని చేరుకోలేనుఅసలు చేరుకుంటానో లేదోతెలియదుదానికితోడు పడుకుంటే భయపెట్టే భయానకకలలుఇలాంటి రోజులు పగవాడికి కూడా రాకూడదు

4 comments:

Anonymous said...

ఆనాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు వవరించావు రా...

Unknown said...

Eppatiki pedda varsam padithe,aa..rojule gurthuvasthai..edi chadivithe malli aa.. Gnapakalu kalla mundu kanapaduthunnai...

శ్రీ ( జనార్ధన శ్రీనివాస రెడ్ది ) said...

ఆ రెండు రోజులు రూమ్ లో ఉన్నాప్పుడు రాసింది

నీ ప్రొత్సాహనికి ధన్యవాదాలు రా...

శ్రీ ( జనార్ధన శ్రీనివాస రెడ్ది ) said...

అనుభవిస్తే కానీ తెలియలేదు,నిజంగా ఇంత భయంకరంగా ఉంటుందా అని