కన్నుల ముందే కరిగి పోతుంది
కమనీయ జ్ఞాపకాలను మనకు వదిలేస్తూ...
నిస్సహాయ స్థితిలో ఉన్న
అసమర్దునికి సైతం అనితర సాధ్యం కానటువంటి విజయాలను సాధిన్చేటట్లు చేస్తుంది...
నేనే గొప్ప అనుకున్న ఎంతోమంది
అహంకారులను, నియంతలను, అమాయకముగా చూస్తూ
మౌనముగా సాగిపోతుంది...
మార్పులు చేర్పులు, మంచి చెడులు ఎన్ని జరుగుతున్నా సాక్షిగా ఉంటుంది కానీ వాటికి సలహాలు
ఇవ్వనిది...
రాజుల విజయాలు, ప్రభుత్వ పాలనలు, సామాన్యుల కష్టాలు,
సంపన్నుల విలాసాలు అన్నింటిని తన మదిలో నింపుకుంటుంది...
చరిత్ర కెక్కిన ప్రేమకధలు, చరిత్రను కించపరిచిన హీనగాధాలు, అబ్బుర పరిచే
అద్భుత ఆవిష్కరణాలు మరెన్నో మదిలో దాచుకున్న మౌనం ...
కుబేరుడైన , కూటికి లేని వాడు అయిన తనతో సాగిపోవడమే గాని ,
తరలిపోయిన క్షణాన్ని కూడా మరల ఇవ్వనిది...
మానవ మేధస్సు కు అందని ఏన్నో సమస్యలకు , తన కాల గమనంలో
సమాధానం చెప్పిన మౌన ముని...
No comments:
Post a Comment