Friday, August 25, 2023

భూమి చంద్రుని తో


 ఎంత మందికి స్ఫూర్తినిచ్చావు

ఎన్నెన్ని కవితలు, కథలు , కందపద్యాలు, యుగళ గీతాలు, విరహ తాపాలు, గజళ్లు, అవధానాలు...

అసూయ కలిగేది నిన్ను చూస్తుంటే. 


ఇప్పుడు నీ వంతు సుమా!

తెల్లని మబ్బుల మాటు నుంచి నీలి వర్ణాలను, అక్కడక్కడ పచ్చని ఛాయలను ఎలా వర్ణిస్తావో...


దూరం తగ్గింది, దారులు పడ్డాయి. పల్లెటూరు లాగా పదే పదే కలుస్తామో, లేక పట్టణాల లాగా పలకరింపు కూడా కరువు అవుతుందో...


ఎంత త్వరగా నా భారం తగ్గించి తరువాత తరానికి ఆతిథ్యం ఇస్తావో.

ఆశ తో ఎదురు చూస్తూ...


నీ అవని


✍️ శ్రీ ✍️

24.08.23.

1 comment:

లలిత said...


'అక్కడక్కడ' పచ్చని ఛాయలు.. చెప్పకనే చెప్పారు అరణ్యాలు వృక్షాలు తగ్గిపోయాయని..👌