నూతన శకానికి నాంది పలికి, ఆశల అంచులు మరింత పెంచిన భాద్యతాయుతమైన క్షణం.
నీ మీద కాలు పెట్టిన క్షణం
140 కోట్ల భారతీయుల ఆనందం తో మొదటిసారి భూమి మీద కాలు మోపక గెంతులేసిన క్షణం
నీ మీద కాలు పెట్టిన క్షణం
ప్రపంచానికి కలలు కనడం నేర్పిన స్వాప్నికుడి ఒక కల నెరవేరిన అధ్బుత క్షణం
నీ మీద కాలు పెట్టిన క్షణం
దృఢ సంకల్పం ఉంటే అసాధ్యాలు సైతం సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన క్షణం
నీ మీద కాలు పెట్టిన క్షణం
ఇన్నేళ్ళ దూరపు చుట్టరికానికి, రాక పోకలు మొదలు పెట్టిన మధుర క్షణం.
✍️ శ్రీ ✍️
24.08.23.
No comments:
Post a Comment