ప్రజా సమస్యలు కోసం నిరంతరం పోరాడుతూ , ప్రజల పక్షాన ఉన్నవాడే నిజమైన నాయకుడు.
పదవులున్నా మరెక్కడో ఉన్నా, పీడిత బాధిత జనాల కోసం ఆ అధికారాలనే కాక ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదులుకున్న వాడే ఆదర్శ నాయకుడు.
ప్రజల గుండెల్లో వందేళ్లయినా చిరస్మరణియంగా ఉండే మహోన్నతమైన మహా నాయకుడు.
"చే" నీలాంటి వాడొకడు కావాలీనాడు నా దేశానికి, నా ప్రజల దశను దిశను మార్చి నూతన జవసత్వాలను నింపడానికి…
ఎందుకురా ఈ ఆరాటం, ఎదుటివాడి మీద అర్థం లేని పోరాటం, తెల్లారి లేచింది మొదలు ఎత్తుకు పై ఎత్తులు , కుయుక్తులు...
మనం బ్రతుకుతున్నది సభ్యసమాజం లోనా , చదరంగం బల్ల మీదా
బ్రతికే నాలుగు రోజులు నీకోసం నువ్వు బ్రతుకు, నలుగురితో నవ్వుతూ బ్రతుకు,
నలుగురితో అసహ్యించబడుతూ నరకంలో బ్రతకకు
అందరూ కావాలి అనుకునే ఆ ఒక్కడిలా బ్రతుకు
No comments:
Post a Comment