Saturday, March 17, 2018

వసంతం...

ఈ ఇలలో
ఓ కోవెలలో
మామి చెట్టు కొమ్మలో
కూసెను కోయిల
కుహు కుహు రాగాలలో
అల్లంత దూరాన
ఉయ్యాలలో
ఓ కన్న తల్లి కనుసన్నలలో
కేరింతలు కొట్టెను
కోయిల పాట విన్న
పాల బుగ్గల
పసిడి మోము బాలుడు
అది చూసి తల్లి
మురిసేను ఆనందములో
వసంతం వచ్చేనని
తన , మన ఇళ్ళలో

No comments: