Thursday, March 8, 2018

Wish You A Happy Womens Day...






ఆడదంటే కాదు అంగడిలో బొమ్మ
ఆడదంటే నిన్ను ఒడిలో ఆడించిన అమ్మ


ఆలి అంటే కాదు నీ వేలు పట్టుకొచ్చే మైనపు బొమ్మ
నీ వంశానికి ఊతమిచ్చే మరో మహా వృక్షపు కొమ్మ


అలుసు చేయ్యబోకు ఆడదాన్ని , అబల అని
నీ జన్మంతా  సేవ చేసినా ఋణం తీర్చుకోలేని మమకార మమతల గని


తల్లి అయి , చెల్లి అయి నీవు మెచ్చిన నిచ్చెలి అయి నీ ఇంట ఉండేది ఈ ఆడదే
నిన్ను జననం నుంచి మరణం వరకు మగ మహారాజుగా మార్చేది ఆ ఆడదే