Wednesday, December 6, 2017

అబల



తెలుగు వెలుగు లో మనము మరిచిపోయిన తెలుగు పదాలు అని కొన్ని పదాలు పరిచయం చేసారు, జూలై 2017 సంచికలో వాటిలో “ శృంగార కట్టే “ అంటే చీపురు అని .” చపేటములు” అంటే లెంపకాయలు అని చదివినప్పుడు నాకు అనిపించినా నాలుగు మాటలు

శృంగార కట్టెచేత బట్టి ముగ్ద మనోహరి మురిపంగా ముంగిట శుభ్రపరచుచుండె ఉషోదయ సమయాన...

చపల చంచల మనస్సుతో అబలని తలచి, తరచి తరచి చూస్తుండే చేరువగా నించొని  పురుష పుంగవుడొక్కడు...

అటుపోవు కన్యకామణి పితృ సమానుడొక్కండు, ఇతగాడి డొక్కను పొడిచి, కరములు విరిచిచపేటములునాలుగు తగిలించి అచ్చట నుండి తరలిపొమ్మనెను... 

అవమాన భారం ఇసుమంతయు లేక ఈర్ష్యతో ఈసడింపుగా, ఆ ఇంటి వాకిలిని వదిలిపోయెను, కుక్కరీతిన అక్కసుతో అరుచుకొనుచు...

కడకు కన్యకా మణి ఆ దినం పోవుచుండా విశ్వవిద్యాలయంనకు విధి చివర కాపు కాసి, అడ్డగించి , పలు వ్యంగ మాటలతో దుర్భాసాలాడి దూషించెను...

కనులు నీరు కరుచుండా , వడివడిగా పరిగెత్తు రీతిన పారిపోయెను అచ్చట నుండి , పాపం అబలై ...

తల్లిదండ్రులకు తెలుపగా తగువులగునని తలచి , తనలోనే క్రుంగి తలవంచుకు , అది అదను తలచి దశకంఠుడై చెలరేగిపోయెను విజ్ఞత మరచిన విధి కుక్క ...

చెయ్యెత్తి మొక్కి , నన్ను ఇంకా విడువ అన్న అని మనస రా కోరగా , మనిషన్న మాట మరచి ముఖామున ఉడుకుతున్న ఆమ్లము ఒకటి జల్లి పారిపోయన్...

అన్నకి అందాల చెల్లి , అమ్మ నాన్నల  ఇంటి కల్పవల్లి , కడకు కట్టిగా కాలి కురూపి గా మారెను
ఆ ప్రబుద్దిని పట్టుకొని ఐదుయెడ్లు చెరశాల  బంధింప , బహు బలిసి బయటకు వచ్చే , తిరుగుచుండ యధావిదిగా గానుగేద్దువోలె...

కురూపము చూసి తనను తాను స్వికరించలేక , తనువు చలించే తాడుతోడ వ్రేలాడుచు విధి వంచిత విహంగమొలె...

No comments: