నా వాదం
కాదు ఏ కుల తత్వం
నా వాదం
కాదు ఏ మత తత్వం
నా వాదం
ఒకటే సమానత్వము
నేను కాదు
వ్యతిరేకం అన్య భాషతత్వానికి
నేను కాదు
వ్యతిరేకం అభివృద్ధి తత్వానికి
నేను
ప్రేమికుడను మాత్రమే ఆంధ్రభాషా తత్వానికి
ఏ రాజకీయం
కాదు నా వర్గం
ఏ ప్రాంతం
కాదు నా పక్షం
సర్వ జనుల
ఆభివృద్దే నా సమున్నత లక్ష్యం
నా వలయం
నాది
నా మార్గం
బహు సరళమైనది
నా వలయంలో
విషం చిమ్మితే క్షమించడం అన్నది లేనే లేనిది
ఆధునికతా
కాదు అలంబనకు మూలము
ప్రాచినతత్వం
కాదు ప్రగతికి అవరోధము
ప్రాచినత
తో కూడిన ఆధునికం పరిజ్ఞానం అందరకి శ్రేయస్సుకారము
పోరాడితే
పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప
ఆలోచిస్తే
పోయేదేమీ లేదు ఆజ్ఞానం తప్ప
ని
ఆలోచనలతో ఎదుటివాడి పోరాటతత్వాన్ని మేల్కొల్పిన్నపుడు ఇంకేమి ఉండదు ఈ ప్రపంచంలో
ఆభివృద్ధి తప్ప
పడక పొతే
పరుగు రాదు
పడక వదలక పొతే
పయనము సాగదు
పడి
లేచిన తరువాత నీకు విజయం రాక మానదు
2 comments:
Nice reddy garu
Thank you Ravi Garu
Post a Comment