Tuesday, November 28, 2017

నెత్తుటి చుక్కలు


తన మీద ఆధారపడిన తన వారి కోసం , ఒక పూట కూటి సంపాదన కోసం చెమట చుక్కలుగా మార్చాడు అతని నెత్తుటి చుక్కలు...


నమ్మిన సిద్ధాంతము కోసం , అనుకున్న ఆశయము కోసం , ప్రాణాలు ఫణంగా పెట్టిన నాడు , మొదటిగా ప్రతి యోధుడు  అర్పించినవి ఆ నాలుగు నెత్తుటి చుక్కలే...


జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించాలని అనుకున్నప్పుడు , కళ్ళ ముందు అక్రమాన్ని ఆపాలి అనుకున్నప్పుడు , అమాయకులా నుండి విద్రోహుల విజయానికి చిహ్నం ఆ నెత్తుటి చుక్కలే...


సమ్మెలు ,ధర్నాలు , సమస్య ఏదైనా సామరస్యంగా పరిష్కారము కానీ నాడు ప్రప్రధముగా జాలువరేది సామాన్యుల నెత్తుటి చుక్కలే...


స్వాతంత్ర సమరంలో అతివాద పోరాటానికి ఆజ్యం , బ్రిటిష్ పాలకుల గుండెల్లో గుబులుకి శ్రీకారం ఈ నెత్తుటి చుక్కలే...


భుర్జవా, భూస్వాముల నిదురలేని రాత్రులకు అంకురం,ఎర్ర సిరా తో రాసిన చరిత్రల ఘనకీర్తికి మూలం ,సాయుధ పోరాట యోధుల నెత్తుటి చుక్కలే...


నేను రాస్తున్న పెన్ సిరా అయిపోతే , నా నెత్తుటి చుక్కలు  నైనా వాడు తాను కానీ రాయడం మాత్రము అపాను అన్నవారు ఎందరో దారపోసింది ఈ నెత్తుటి చుక్కలే...

No comments: