విశాల సాగర వీక్షణం, విశ్వ విద్యకు, విద్వత్ కు, పెట్టని ప్రకృతి అందాలకు పట్టుకొమ్మ,ఆంధ్రమాత సిగలో తలమానికం...
పరమ
శివుని ప్రాపకంతో కైలాసగిరి అందాలు కనుల ముందు సాక్షాత్కరించి, కొండ కోనల
సోయగాలు అనంతంగా అనంతగిరిలో అమర్చుకొని ముస్తాబు అయినది నా విశాఖ...
సాగర తీర సముదాయాల సమాహారం...
ప్రాకృతిక పర్వతాలప్రాకారం...
మన్య వీరుని మనకందించిన మహా నగరం ...
సినీ వినీలాకాశంలో విశిష్ట స్థానం...
కవిత్వాన్ని ఖండించి,శాసించిన నా శ్రీశ్రీ ని తెలుగుభాషకి పరిచయం చేసిన మహానగరం...
పారిశ్రామికీకరణకు, పట్టణీకరణకు ప్రామాణికం...
ఆటవిడుపులకి,ఆహ్లాదానికి,అటవీ సంపదకి,ప్రకృతి శోభకి పట్టుకొమ్మ...
విజయ చిహ్నాలకు , చరిత్ర సత్యాలకు సజీవ సాక్ష్యం...
తుఫానులను, సునామీలను గుండెలపై మోసి కూడా చెక్కుచెదరని పడిలేచిన కెరటం...
లెక్క లేనంత మంది కవులకు, కళాకారులకు, స్వాతంత్ర సమరయోధులకు ,శాస్త్రవేత్తలకు పుట్టినిల్లు...
రాష్ట్రం ఏదైనా రా రామ్మని పిలుస్తుంది, దేశం ఏదైన ధైర్యంగా ఉండమంటుంది, మంచితనానికి, మత సామరస్యానికి మచ్చుతునక...నా విశాఖ
No comments:
Post a Comment