తెలుగు సాహిత్య చరిత్రలో వందేళ్లయినా పదును తగ్గని అతి కొన్ని కలాల్లో మరిచిపోలేని,
రాసింది అక్షరాలా పాటిస్తూ ,
నిర్భీతిగా నిజాన్ని చెప్తూ
ఆఖరి శ్వాస వరకూ అక్షర సేద్యం
చేసిన అవిశ్రాంత శ్రామికుడు
కవితలతో ఆవేశాన్ని నింపి ,
కథలతో ఆలోచనను మేల్కొలిపి
ప్రసంగాలతో నిదురిస్తున్న మెదళ్ళను తేజోవంతం చేసి
నాటి తెల్లవారి దురాగతాల నుంచి
నేటి నల్ల వారి దౌర్జన్యాల వరకూ ఎవరికీ బెదరక, కలంతో ఖండిస్తూ వచ్చిన అలుపెరుగని సైనికుడు
జోహార్లు కాళోజీ జోహార్లు
నీ కలానికి , నీ ఖలేజా కి
నువ్వు నడిచిచూపిన మార్గానికి,
నమ్మిన సిద్ధాంతానికి...
జోహార్లు కాళోజీ జోహార్లు
No comments:
Post a Comment