పెత్తందారుల గుండెల్లో ప్రేమ కెరటమై
ఎగసిపడ్డాడు
ప్రేమనయితే గెలిపించుకున్నాడు కానీ
ప్రాణాలను కోల్పోయాడు
ఇంకా కులాల కోసం, ప్రాణాలు తీసుకునే
ఆటవిక సమాజంలో ఉన్నందుకు మరొక సారి సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకుంది
కూతురు తల్లి కాబోతుందనే వార్త విని
,సంబరాలను అంబరాలకు తాకించే తండ్రి గురించే విన్నాం ఇన్ని రోజులూ..
ఆ కూతురికి, భర్త మొండాన్నే బహుమతిగా
ఇచ్చే కులపిచ్చి సైకో ను చూస్తున్నాం కొత్తగా
ఎక్కడరా నీ కులం, ఆస్తి, అంతస్తు,
సంఘంలో నీ పరువు, ఐదో తనం కోల్పోయిన నీ కూతురు కాళ్ళ గోటి విలువ లేనివి
కన్న కూతురు తోనే "ఎదురుగా
వస్తే, నేనే చంపేస్తాను" అనిపించుకున్న తండ్రితనం ఉన్నా ఒక్కటే లేక పోయినా ఒక్కటే
ఇక నైనా ఆపండిరా మీ కుల గజ్జి చేష్టలు
, మత పిచ్చి అంధ విశ్వాసాలు
విచ్చల విడి తనం వద్దు విచక్షణతో
ఆలోచించండి, కోటి కలల ఆ నిండు జీవితాలు మీ కులం తీసుకురాగలదా
మీ హోదాలూ, మీ అహాలూ ఆ హృదయాల గాయాలు
మాన్పగలవా
ఏమి సాధించావురా ఈ హత్యతో... పరిగెత్తి
ప్రాణ భిక్ష పొందడం తప్ప
దీని కోసమా ఇన్నాళ్ళూ మానసిక క్షోభ
పడ్డావు, పెట్టావు
ఒకనాడు కూతురిని ప్రేమతో సాకిన నువ్వు
, కల్లు తాగిన కోతిలా నేడు విధ్వసం సృష్టించి సార్థక నామధేయుడివి అయ్యావు
### ఇకనైనా ప్రభుత్వాలు కులాల పేరుతో
కాకుండా ఆర్థిక అసమానతల బట్టి రిజర్వేషన్ కల్పిస్తే ఈ కుల పిచ్చి కొంతయినా తగ్గుతుంది.
స్వఛ్ఛందంగా రిజర్వేషన్ వదులుకున్న వారిని, ఇతర కులాల వారిని ప్రేమ వివాహాలు చేసుకున్న
వారినందరినీ ఒక వర్గం గుర్తిస్తే కొన్నేళ్లకు ఈ కులం అనే మహమ్మారి నుంచి మన సభ్యసమాజాన్ని
కాపాడుకోగలం అని నాదో చిన్న ఆశ###