ఆకలేసి కేకలేసి
అడవిలో బ్రతకలేక
దానిక్కారణం అయిన జన అరణ్యంలో
కడుపు నింపుకుందామని ఆశ తో వచ్చి
వచ్చినా పని లేక
ఉన్నా ఇచ్చే నాధుడు లేక
ఆకలేస్తే, అడుక్కున్నా మెతుకు
దొరక్క
నలిగిపోతున్న పేగుల కోసం
నాలుగు బియ్యపు గింజలు దొంగలిస్తే
దొరల వాళ్లే దొంగ లంజా కొడుకులు
కాళ్ళు ,చేతులు కలియ గట్టి
ఒంటి మీద దెబ్బ మీద దెబ్బ కొట్టి
చేసిన చిన్న నేరానికి నీకు చితి కట్టి
పైగా ఆ హింసని పైశాచికంగా చిత్రించి
మానవత్వాన్ని మంట గలిపిన
ఈ నీతి చంద్రులు
కోట్లు కొల్లగొట్టిన బడా బాబుల జోలుకెళ్లరు
బడుగు జీవుడని నిన్ను
బంధించి
బాధించి
వధించారు
అయినా నువ్వు ఎప్పుడో చచ్చి పోయావు
వీళ్ళ ఇళ్ల కోసం మీ కొండ రాళ్లు తరలించినప్పుడు
వీళ్ళ విలాసాల కోసం ఫార్మ్ హౌస్ లు సృష్టించినప్పుడు
కలప ,ఔషధాలు ఒక్కటేమిటి
అన్నింటిని వారి అవసరాల కోసం తరలించినప్పుడు
ఎప్పుడో చచ్చిపోయిన
నిన్ను ఇలా చిత్రవధ చేసి
వీళ్ళే సమాజం ముందు చచ్చిన శవాన్ని పీక్కు తినే
రాబందులుగా మిగిలిపోయారు
3 comments:
Nijame. 👌👌
Thank You ...
Thank You ra
Post a Comment