Saturday, January 13, 2018

కలం బలం



కదం తొక్కండి మరో మారు
కలం బలం విలువ తెలిసేలా
కుతంత్రాలు కూకటి వ్రేళ్ళతో పెకలించేలా
రాసేద్దము మన నెత్తుటి సిరాతో
ఇవి అక్షరాలు కాదు అణ్వాయుధ ఋక్కులు అని
ప్రపంచాన్ని మార్చే ప్రచండ శక్తులని
ఎక్కడ ఏ అన్యాయము జరిగినా
ఎప్పుడు ఏ అవమానము తోంగిచూసిన
ఆదుకునేందుకు అక్షరం ఆసరాగా ఉందని
అలసి సొలసిన వారికీ బాసటగా ఉందని
కదం తొక్కండి మరో మారు
                                                                         కలం బలం విలువ తెలిసేలా