Thursday, January 18, 2018

కన్స్ట్రక్షన్




 శుభోదయం 


 సహోద్యోగులందరికీ...

మొదలైందా డ్రాయింగ్స్ తో కుస్తీ

సైట్ కి వెళ్ళటానికి వాహనాల కోసం గస్తీ

సైట్ కి టైం అయ్యింది అయినా టీ ఇంకా రాలేదని టెన్షన్ జాస్తి 

అంతలో ఎవరో మొదలు పెట్టారు ఇష్టాగోష్ఠి

హమ్మయ్య చేరిపోయాము సైట్ కి,
ఇక మొదలు పెడదామా కాంట్రాక్టర్లతో ప్రోగ్రెస్ కోసం మళ్ళీ కుస్తీ

అంతలో మరో గంటల్లో మీటింగ్ ఉందని ఫోన్లో మెసేజ్ ల కుంభవృష్టి

బ్రతుకు జీవుడా అని డేటా కలెక్షన్ లో అందరితో సమిష్టి కృషి

మీటింగ్ లో ప్రశ్నల పరంపరకు మెదడు అయ్యేను, కరగడానికి సిద్ధముగా ఉన్న పేస్ట్రీ 

అంతలో మొదలయ్యేను ఆత్మా రాముడి ఆకలి సృష్టి 

ఏదోలా అయిందనిపించాము మధ్యాన భోజనాల కోలాహల సమిష్టి

మళ్ళీ మొదలైంది పనిలో చూపించవలసిన సృజనాత్మక దృష్టి 

సూర్యుడు, చంద్రుడు గా మారినా మనం మాత్రం ఇంకా ఇంటికి వెళ్ళాలా, వద్దా అన్న మీమాంస తో
మన మెదడు లో మెదులుతున్న మరో త్రిశంకు స్వర్గం  సృష్టి

ఇదే ఇదే కన్స్ట్రక్షన్ లో  దైనందిన  ఉన్నత (దు) స్థితి

Saturday, January 13, 2018

సంక్రాంతి శుభాకాంక్షలు





కొత్త పంటల కోతలు
అత్త మామల ఆహ్వానాలు
కొత్త బట్టల కళకళలు
కూతురు, అల్లుళ్ళ ఆగమనాలు
రంగవల్లుల ముంగిళ్ళు
భోగి మంటల భగ భగలు
బుడతలకు భోగిపళ్లు
అరగింపుకై పిండివంటలు
బావ మరదళ్ళ చిలిపి చేష్టలు
కొత్త సినిమాల విడుదలలు
కుర్రకారుల కోళ్ళ పందేలు
కనుమరుగైన నాటి సంక్రాతి కళ
ను
వాట్స్పప్ లో విషెస్ లు
ఫేస్ బుక్ లో పోస్టింగ్ లు
గ్రూపుల్లో గుంపు గా మెసేజ్ లు
 పిండి వంటలకై ఆన్లైన్ లో ఆర్డర్లు
తో
వింత పోకడల వికృత రూపంతో
ఆహ్వానిస్తూ
                                                            అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు