Tuesday, November 28, 2017

నెత్తుటి చుక్కలు


తన మీద ఆధారపడిన తన వారి కోసం , ఒక పూట కూటి సంపాదన కోసం చెమట చుక్కలుగా మార్చాడు అతని నెత్తుటి చుక్కలు...


నమ్మిన సిద్ధాంతము కోసం , అనుకున్న ఆశయము కోసం , ప్రాణాలు ఫణంగా పెట్టిన నాడు , మొదటిగా ప్రతి యోధుడు  అర్పించినవి ఆ నాలుగు నెత్తుటి చుక్కలే...


జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించాలని అనుకున్నప్పుడు , కళ్ళ ముందు అక్రమాన్ని ఆపాలి అనుకున్నప్పుడు , అమాయకులా నుండి విద్రోహుల విజయానికి చిహ్నం ఆ నెత్తుటి చుక్కలే...


సమ్మెలు ,ధర్నాలు , సమస్య ఏదైనా సామరస్యంగా పరిష్కారము కానీ నాడు ప్రప్రధముగా జాలువరేది సామాన్యుల నెత్తుటి చుక్కలే...


స్వాతంత్ర సమరంలో అతివాద పోరాటానికి ఆజ్యం , బ్రిటిష్ పాలకుల గుండెల్లో గుబులుకి శ్రీకారం ఈ నెత్తుటి చుక్కలే...


భుర్జవా, భూస్వాముల నిదురలేని రాత్రులకు అంకురం,ఎర్ర సిరా తో రాసిన చరిత్రల ఘనకీర్తికి మూలం ,సాయుధ పోరాట యోధుల నెత్తుటి చుక్కలే...


నేను రాస్తున్న పెన్ సిరా అయిపోతే , నా నెత్తుటి చుక్కలు  నైనా వాడు తాను కానీ రాయడం మాత్రము అపాను అన్నవారు ఎందరో దారపోసింది ఈ నెత్తుటి చుక్కలే...

Saturday, November 11, 2017

నా భావాలు...




నా వాదం కాదు ఏ కుల తత్వం
నా వాదం కాదు ఏ మత తత్వం
నా వాదం ఒకటే సమానత్వము


నేను కాదు వ్యతిరేకం అన్య భాషతత్వానికి
నేను కాదు వ్యతిరేకం అభివృద్ధి తత్వానికి
నేను ప్రేమికుడను మాత్రమే ఆంధ్రభాషా తత్వానికి


ఏ రాజకీయం కాదు నా వర్గం
ఏ ప్రాంతం కాదు నా పక్షం
సర్వ జనుల ఆభివృద్దే నా సమున్నత లక్ష్యం


నా వలయం నాది
నా మార్గం బహు సరళమైనది
నా వలయంలో విషం చిమ్మితే క్షమించడం అన్నది లేనే లేనిది


ఆధునికతా కాదు అలంబనకు మూలము
ప్రాచినతత్వం కాదు ప్రగతికి అవరోధము
ప్రాచినత తో కూడిన ఆధునికం పరిజ్ఞానం అందరకి శ్రేయస్సుకారము


పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప
ఆలోచిస్తే పోయేదేమీ లేదు ఆజ్ఞానం తప్ప
ని ఆలోచనలతో ఎదుటివాడి పోరాటతత్వాన్ని మేల్కొల్పిన్నపుడు ఇంకేమి ఉండదు ఈ ప్రపంచంలో ఆభివృద్ధి తప్ప


పడక పొతే పరుగు రాదు
పడక వదలక పొతే పయనము సాగదు
                                                             పడి లేచిన తరువాత నీకు విజయం రాక మానదు