ఆకాశము అంచు ఎక్కడో సముద్ర గర్భాన్ని చుంబించింది
ఆ పులకింతకు నీటి బిందువులు అవిరులై ఆకాశన మేఘాలు గా
మారిపోయాయి
ఆ మేఘాలను మలయామరుతం మోహించింది ,తన చల్లని స్పర్శ తో స్పృశించింది
తమ ప్రేమకు గుర్తుగా , చిరుజల్లులను పుడమి ఒడిలో దోసిళ్లతో నింపేసాయి
అక్కున చేరిన ఆ నీటి జడివానను , తమలో మమేకం చేసుకున్నాయి , చెట్లు చెమలు
భూమి తనతో కలిసిన కలయికకు గుర్తుగా , ఉదయభానుడి సాక్షిగా ఎన్నో పూలు , ఫలాలను అందించింది ఆ చెట్లకు
వాటిని సేవించిన మనిషికి మరి తెలియదా ప్రేమకు ప్రతిరుపమే ఈ
ఫలహారం అని ఆ మనిషి కడా విశ్వప్రేమకు ప్రతిరూపం...
2 comments:
Very well written "Sri" Garu.... Prakruti premaku intha manchi paribhasha inthaku mundu eppudu choodaledu.... I hope every person realizes this, so that the world can become a better place to live.
Rashmita
So glad you liked it.
Thanks for sharing your opinion. Keep visiting my blog.
Post a Comment