Wednesday, June 14, 2017

అశ్రు నివాళి తో Dr. సి నా రె గారికి...




కళ్ళు రెండు చూడటానికే , కాళ్ళు రెండు నడవడానికే,

కళ్ళు రెండు కలహించుకుంటే,

కాళ్ళు రెండు కలిసి నడవకుంటే,

ఇంకెక్కడి దృశ్యం, ఇంకెక్కడి గమ్యం,

తెలుగు దేశంలో పుట్టి, తేట తెలుగుతోనే పెరిగి, ఇంతటి ఔన్నత్యాన్ని, ఉన్నతిని తెలుగు ద్వారా పొంది,

నీ సాహిత్య ప్రతిభతో సాహిత్య అకాడమీ అవార్డుని సొంతం చేసుకొని, నీ పదబంధాలతో పద్మశ్రీ ని పొంది, నీ జ్ఞానానికి పరిపాటి జ్ఞానపీఠ్ అనేలా చేసి, తెలుగు కవితా లోకంలో పద్మభూషనుడై భాసిల్లిన నువ్వు

నేడు నీ కనుల ముందే తెలుగుకి ఈ స్థితి వస్తే చూడలేక, తెలుగు చచ్చిపోయే దుస్థితే వస్తే దాని కంటే ఒక్క రోజు ముందు నేను చనిపోతాను అని మౌనంగా నీ గమనాన్ని మరణము వైపు మరలించావా

మరణము నీ దేహానికి కానీ నీ పాటకూ, కవితకూ, మా కోసం నువ్వు వదిలి వెళ్లే నీ ఏ కళకూ లేదు.

ఓ మహునుభావా, ఓ మహా మనిషీ, మా తెలుగుతల్లి ముద్దుబిడ్డ ఓ సి నా రె...

నీకు ఇదే మా ఆశ్రునివాళి...


( జననం: 29 July 1931--- మరణం: 12 June 2017)
 

4 comments:

Venkat said...

Excellent .. adbhutamina Kavi gariki adbhutamina nivaali

శ్రీ ( జనార్ధన శ్రీనివాస రెడ్ది ) said...

Thanks venkat...

Unknown said...

తెలుగు సాహిత్యానికి మరియు భాషకు సి నా రే గారు చేసిన సేవ వెలకట్టలేనిది ... అయన ఎప్పటికి అమరజీవే...

శ్రీ ( జనార్ధన శ్రీనివాస రెడ్ది ) said...

నీతో 100% ఏకిభావిస్తునాను...