మగత తీరని రెప్పలను తోసుకుంటూ వచ్చే ఉదయాన్ని పొమ్మంటున్నా...
రాత్రి నీ ఆలోచనలో అలిసిపోయిన మనసు సేదతీరాలని..
తీరికలేని మధ్యాహ్నంలో నీ తలపును పక్కకు తోసేస్తున్నా…
నీ స్పృహ తో కొట్టుమిట్టాడే గుండె వేగాన్ని తగ్గించాలని
జ్ఞాపకాలు… మిణుగురులై చుట్టుముట్టే సాయంత్రపు ఏకాంతంలో
తెలియకుండా ఎదురు చూస్తూనే ఉన్నా
వచ్చే నిశిరాత్రి ఊరికే రాదు...
నువ్వుంటే బాగుణ్ణనే ఆలోచన తెస్తుంది...
అయినా
వానలో వెన్నెల కోసం వెతుకుతున్నానా...
అత్యాశేమో...