సమాజంలో కళంకితులై
కోరుకున్న వాడి కళ్లలో కావ్య కన్యకలై
చీకటి పువ్వులై
చిదిమిన మల్లెలై
క్షణిక సుఖాన్ని ఎదుటవారికిచ్చి
తన కుటుంబాపు ఆ రోజు కడుపు కష్టం తీర్చి
తన ఇష్టాఆయిష్టాలను పక్కన పెట్టి
కొరివచ్చిన వారిని సుఖ పెట్టి
కోరికలను, కన్నీరును మూటకట్టి
జరుగుతున్న ఆక్రమణను మునిపంటి కింద
బిగబట్టి
తనదైన తనువు పై వేరొకరెవరో చిద్విలాసముగా
స్వేరవిహారము చేస్తుంటే
మనసు మధన పడుతున్న, మోములో
చిరునవ్వు చెదర నివ్వక ,తనువును సాంతం అర్పిస్తుంటే
నాగరిక సమాజంలో నాటుకున్న ఆనాగరికతకు
గుర్తులై
పెద్దముదారుల విలాసాలకు ప్రత్యేక సాక్షాలై
నిర్దాక్షిణ్యంగా , నిర్దయగా విది వాంఛితలై
సమాజ దృష్టి లో విలువలేని వేలయలులై
తగిలిన గాయాలకు మందు మరొక కొత్త గాయం
అవుతుంటే
ప్రపంచ పైశాచికము మొత్తం తనపై ఆ పడక గదిలో
చూపిస్తుంటే
విధులలో ,విద్యుత్ దీపాల
వెలుగులలో , విలాస నక్షత్రవిడుదులులో
రెక్కతెగిన విహంగలై , చిదిగిపోతున్న
పూసిన పువ్వులై
తరతరాల చరిత్రలకు చెరగని కుసంస్కార మచ్చలై
మానవజాతి పురోగతిని దిశను ప్రశ్నించే
వేగుచుక్కలై
ఎన్నాళ్లు, ఇంకెన్నేళ్ళు ఈ
అరాచకం , ఈ అన్యాయం
వినిపించడం లేదా ఆక్రందపు ఆర్తనాదాలు
కనిపించడం లేదా కళ్ళ ముందు కాలిపోతున్న
కార్చిచ్చులు