తొలకరి చినుకులతో నేల తల్లి సుగంధాలను నాసికారంధ్రాలకు చేర్చి రంజింప చేసెను
చిట పటల చిరు సవ్వడితో, హోరు గాలి హొయలతో వీనుల విందు చేసేను
తన రాకకు సంకేతంగా మయూరి నాట్య విన్యాసాలతో, రసరమ్య, రమి క్రీడలతో కన్నుల పండుగ చేసేను
చిరుజల్లులు మేను తాకిన వేళ ఆ స్పర్శకు మైమరచని మనుష్యులెవరు లేనట్టి చేసేను
తాను వచ్చెనని సాక్ష్యంగాగా పలురకాల వంటకాలతో, కుటుంబ పరివారము ఒక చోట చేర్చి రుచులెన్నో చూపెను
పంచేంద్రియాలకు పరమానంద భరిత మహోనందాన్ని కలిగించే అమృతవర్షిణి
జడి వానకు లయ తప్పక కదిలే చెట్ల కొమ్మల, ఆకుల వివిధ రకాల నృత్య రీతులు
గుంటల్లో, ఒక్క నిమిషంలో జీవన్మరణాలతో పోరాడి, ఓడుతున్న కొన్ని వందల గాలిబుడగలు
కనుచూపు మేరలోనే పంచరంగులతో ప్రాణం పోసుకున్న ఇంద్రధనుస్సుల ద్వయం
అంతలోనే దురాన విద్యుత్ కాంతులతో విర్రవీగుతూ, వికట అట్టహాసం చేసి మెరుపు వింజామరలు
పశుపక్షాదులను, చెట్టుచేమలను స్వచ్చందస్నానాలు చేయించే నీ వైనము
పనులలో మునిగి తెలుతున్న ప్రతివాడిని, తన పసితనం గుర్తు చేసేలా ఒక్కసారి నన్ను చూడమనేలా చేసే నీ హుందాతనం
అద్బుతం మరియు ఆశ్చర్యముతో కలగలిపిన కడగళ్ళతో కూడిన వడగళ్ళు
కాగితాల పడవలతో ఆరు బయట పిల్ల కాలువలో ఆనందంగా ఆడిన చిన్ననాటి జ్ఞాపకాలు
తుప్పరులు తాకుతుంటే బాల్కనీలో భౄ కాఫీ తాగుతూ ఆ రెండింటిని కుటుంబ సమేతంగా ఆస్వాదించిన ఆనందక్షణాలు
నిన్ను చూసి , నా కూతురితో పాటుగా పసివాడినై పరవశించి అరిచిన “ వో వో....” అరుపులు
ఒక్కటేమిటి ఎన్నో మధుర జ్ఞాపకాలు...