నా జననం జనం కోసం, నా మరణం మార్పు కోసం
నా జనన మరణాలు జనంలో మార్పు కోసం...
నా మార్గం విప్లవం, నా గమ్యం సమనత్వం
నా ధ్యేయం విప్లవంతో సమనత్వం సాధించడం...
విప్లవం అంటే కాదు విద్వంసం , విప్లవం అంటే కాదు విచక్షణా కొల్పోవడం
విప్లవం అంటే జనులందరిలో విజ్ఞతతో, వివేకాన్ని మేల్కొలపడం...
ఆకలి, దప్పికలు, అవకాశ ఆసమానతలు లేని
ఆర్హత బట్టే ఆధీకారం, శ్రమ బట్టే సౌకర్యం ఉన్న ప్రపంచం నా స్వప్నం...
ప్రకృతికి లేదు ఏ భేషాజం , వికృతుముగా ప్రవర్తిస్తుంది మనమే
చూసి నేర్చుకుందాం, ఈర్ష్య,ద్వేషాలను వదిలేద్దాం మనస్వప్నం సాధించుకుందాం...
ఈ దేహం మూడుణాల ముచ్చట , ఆదర్శంగా జీవిద్దాం
భావితరాలకు బంగారు బాట వేసి , చరిత్రలో చిరస్మరణీయులవుదాం...
ఆదర్శం అంటే కాదు మన జీవితాలను త్యాగం చెసేయ్యడం , కనిపించిన వారిని ఆప్యాయంగా
పకలరించడం , నహజ వనరాలను ఆవసరం మేరకు ఉపయోగించడం, ప్రకృతి సహజత్వం కాపాడడము,
వీలైనంత వరకు ఎదుట వారికీ సాయపడడం...
తోటివాడు మనవాడే అనుకో, ఆర్తనాదం ఆలపించే అవకాశం ఇవ్వకు ఎవ్వరికి
కష్టం అన్నది కనిపించ నివ్వకు ని కనుచూపు మేరలో, విశ్వశాంతికి బీజం నువ్వు, వాసుదేక కుటుంబానికీ వారాసుడునువ్వు...
3 comments:
నీపై శ్రీ శ్రీ ప్రభావానికి నిదర్శనం
మరో అభినవ శ్రీ శ్రీ కావాలని కోరుకుంటున్నా నేస్తమా...
కృతఙ్ఞతలు నేస్తమా...,నీ ప్రోత్సాహం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ
Post a Comment