కదలి రండి కదలి రండి అన్నలారా,తమ్ములారా,అమ్మలార, నాన్నలార,
కదలి రండి కదలి రండి చెల్లెల్లారా,అక్కలారా
ప్రత్యేక హోదా, కావాలనుకున్న ప్రతి పౌరులారా...
మన బలమేమిటో చూపిద్దాం, నిజ సంద్రాన్ని ముంచేద్దాం,మన జనసంద్రంతో....
సమైక్యతను సగం చేసి, మన భవితను అంధకారంలోనింపిన మన పాలకులకు , మన ఏలుకులకు ఎలుగెత్తిచాటుదాం ప్రత్యేక హోదా ప్రతి ఆంధ్రుడి హక్కు అని ...
నాడు మీరు చెప్పిందే నేడు మేము కావాలంటున్నాం..
మా సహనాన్ని పరీక్షించటానికి రెండేళ్ళు సరిపోలేదా...
అద్ధంతరంగా ఆంధ్రను రెండు చేసిన వాళ్ళకు
గణతంత్ర దినోత్సవం గణనీయంగా గుర్తుండిపోయేలా ,
ప్రత్యేక హోదాకి తొలి అడుగు పడేటట్లు , మన సత్తాచాటుదాం.
సహనం తో మరోసారి మీముందుకు వస్తున్నాం,సానుకూలంగా అలోచించి సామరస్యంతో సమస్యనిపరిష్కరిస్తారని సవినయం గా కోరుకుంటున్నాం,.,,
ఒక ప్రధాన మంత్రి ప్రత్యేక హోదా ఇస్తాను అని, మరొకప్రధాని పురిటి బిడ్డను ఆదుకుంటాను అని అన్నారు.
ఇదేనా ఇవ్వడం అంటే, ఇదేనా ఆదుకోవడం అంటే...
మీ మాటలకే విలువ లేకపోతే రాజ్యాంగం అవహేళనఅవుతుంది, ప్రజాస్వామ్యం పరిహాసం అవుతుంది...
కులమతాలకు దూరంగా, రాజకీయరంగస్థలానికిఅతీతంగా మా గుండెల్లో రగులుతున్న భావాలకుప్రతిరూపంగా,
సామరస్యంతో సామూహికంగా సంధిస్తున్న నినాదంఒక్కటే
"ప్రత్యేక హోదా ప్రతి ఆంధ్రుడి హక్కు"
ఒక ఆంధ్రుడు
జనార్ధన్ శ్రీనివాస రెడ్డి