బడ్జెట్ బడ్జెట్ అని
ఎదురు చూసారు
మన సబ్జెక్ట్ లేకుండా
తీసేసారు
టీడీపీ,టీ ఆర్ ఎస్ లు మీకు సాష్టాంగ పడ్డారు
మీరు వారికి సమిష్టిగా
గుండు కొట్టారు
పోలవరం పాయయ్యె
రైల్వే జోన్ ఇక రాదయ్యే
విభజన హామీలు
ఉట్టికెక్కేను
మీకు మాత్రం బుల్లెట్
ట్రైన్లు పట్టాలెక్కేను
మిత్ర పక్షాలు అని
మంచిగా దువ్వారు
విగత హస్తాలు వింతగా
చూపారు
మన వైపు ఎక్కడ మాట్లాడతారని
ఉపరాష్ట్రపతిని చేశారు
ప్రాధేయపడుతున్న
ముఖ్యమంత్రులను ప్రదక్షిణలు చేయిస్తున్నారు
ఇది బడ్జెట్ కాదు
తెలుగు రాష్ట్రాలలో డెత్ ఆబ్జెక్ట్
తప్పక చూపిస్తుంది బీజేపీ
కి వచ్చే ఎన్నికల్లో దీని ఎఫెక్ట్