Thursday, April 24, 2025

పుస్తకం


 *పుస్తకం* 

పుస్తకం...

నిన్ను నిన్నుగా నీకు చూపించే అస్త్రం.

పుస్తకం...

వంద మంది స్నేహితులకు సమానం ఈ అద్భుతం.

పుస్తకం...

అనంత విశ్వం విజ్ఞానాన్ని చేతికి అందించే అద్భుత యంత్రం.

పుస్తకం...
 
రంగం ఏదైనా రాణించాలంటే 
ముందుండి నడిపించే గురుతుల్యం.

పుస్తకం...

కాలక్షేపానికి ఒక వస్తువు కాదు , నీ శక్తి నీకు తెలిపే సత్తువు.

పుస్తకం...

గురువు లేని తనం నుండి, నిన్ను ఎంతో మందికి గురువుగా మార్చే మార్గదర్శకం.

పుస్తకం...

పూట కూటికి లేని వాళ్ళను సైతం ప్రపంచ మేధావులను చేసిన ఆదర్శం.


పుస్తకం...

తాను లేక పోతే జ్ఞాన సంపద పరంపరకు అవరోధం, ఇప్పటి ఈ విజ్ఞానానికి తనకే అగ్రతాంబూలం.


పుస్తకం...

మార్కుల కోసం కాక నీ మార్పు కోసం చదివితే,
నవ సమాజ నిర్మాణానికి నిర్దేశకం.

✍️ శ్రీ ✍️