సంవత్సరం నుంచి ఆ చెట్టును చూస్తున్నాను...
నీడ ఇవ్వడం తప్ప
అది ఇంకేం చేస్తుంది అనుకునేవాడిని.
హఠాత్తుగా ఒకరోజు
ఆ చెట్టు నిండా పసుపు మొగ్గలు
గుత్తులు గుత్తులుగా కనిపించాయి.
రెండు రోజుల తరువాత
నా కళ్లను నేనే నమ్మలేకపోయాను.
ఆ చెట్టు మొత్తం
బంగారు వర్ణంలో మెరిసిపోతూ,
ఎంత అందంగా ఉందంటే
మాటల్లో చెప్పలేను.
దాదాపు నెల రోజుల పాటు
దేదీప్యమానంగా వెలిగిపోయింది.
ఆ తరువాత...
మళ్లీ మామూలుగానే పచ్చగా మారి,
ఎప్పటిలాగే నీడనిస్తూ,
ఏమీ జరగనట్టుగా
మౌనంగా నిలబడి పోయింది.
అప్పుడు అనిపించింది...
మనలో కూడా చాలామంది మనుషులు అలాంటివారే.
తమ అర్హతను,
తమ ప్రతిభను,
తమ విలువను
ప్రపంచానికి చాటుకోవడానికి ప్రయత్నించరు.
ఎదుటివారు గుర్తించినా,
గుర్తించకపోయినా,
తమ పని తాము చేసుకుంటూ
నిశ్శబ్దంగా ముందుకు సాగిపోతారు.
గుర్తించడం, గుర్తించకపోవడం
ఎదుటివారి విజ్ఞతకు వదిలేస్తారు.
ఎందుకంటే...
**ఒకరి విలువను నిర్ణయించడానికి
మనమెవ్వరం?.**
కాలం వచ్చినప్పుడు
చెట్టు తన పూలతో తన అందాన్ని చూపినట్టే,
మనిషి తన కృషితో తన విలువను నిరూపిస్తాడు.
✍️ **శ్రీ** ✍️
