Tuesday, February 13, 2018

నిన్ను మరిచిపోదామని...




ప్రియా...

నిన్ను మరిచిపోదామని
హృదయాన్ని శిలగా మార్చుకుంటే
నీ జ్ఞాపకాలు ఆ శిలని శిల్పం గా మారిస్తే
ఆ శిలా రూపం నీదే అయితే
నిన్ను మరిచేదెలా...!


నిన్ను మరిచిపోదామని
కొద్ది క్షణాలు గాడనిద్ర లోకి వెళితే
కలలోకి కథలు ఏవో వస్తే
ఆ కథల కావ్య కన్యకది నీ రూపమే అయితే
నిన్ను మరిచేదెలా...!


నిన్ను మరిచిపోదామని
విహారయాత్రకు వెళితే
దూరాన కమ్మని కోయిల గానం వినిపిస్తే
ఆ గానం నీ గాత్రాన్ని గుర్తుచేస్తే
నిన్ను మరిచేదెలా...!


నిన్ను మరిచిపోదామని
విదేశాలకు వెళ్ళితే
చిరు మందహాసంతో వనితలు ఎవరో ఎదురొస్తే
ఆ మందహాసంలో నీ మోమే కనిపిస్తే
నిన్ను మరిచేదెలా...!


నిన్ను మరిచిపోదామని
సాగర తీరానికి సేదతీరడానికి వెళితే
అలలు ఆశగా నా కాలిని తాకితే
ఆ స్పర్శ నీ స్పురణను రప్పిస్తే
నిన్ను మరిచేదెలా...!


నిన్ను మరిచిపోదామని
మౌనాన్ని ఆశ్రయింస్తే
నా ఉచ్ఛ్వాశ  , నిశ్వాస గుండె లయ శబ్ధాలు వినిపిస్తే
ఆ లయలో నీ హోయలే కనిపిస్తే
నిన్ను మరిచేదెలా...!


నిన్ను మరిచిపోదామని
విఛ్చిన్న మైన మనస్సుతో , అగమ్యగోచరంగా నడుచుకుంటూ వెళ్తున్నా
అంతలో పిడుగులు , మెరుపుల వర్షం ఎదురైతే
ఆ మెరుపుల వెలుగులలో నీ మోమే ప్రతిబింబిస్తుంటే
నిన్ను మరిచేదెలా...!


నిన్ను మరిచిపోదామని
ఒక నిశీధి గదిలో ఒంటరిగా కూర్చున్నాను
ఆ గదిలో మౌనము
మదిలో అనంతమైన నీ ఆలోచనల పరిభ్రమణం
నిన్ను మరిచేదెలా...!

Sunday, February 4, 2018

తెలుగు రాష్ట్రాలలో బడ్జెట్ ప్రభావం...




బడ్జెట్ బడ్జెట్ అని ఎదురు చూసారు
మన సబ్జెక్ట్ లేకుండా తీసేసారు

టీడీపీ,టీ ఆర్ ఎస్ లు మీకు సాష్టాంగ పడ్డారు
మీరు వారికి సమిష్టిగా గుండు కొట్టారు

పోలవరం పాయయ్యె
రైల్వే జోన్ ఇక రాదయ్యే

విభజన హామీలు ఉట్టికెక్కేను
మీకు మాత్రం బుల్లెట్ ట్రైన్లు పట్టాలెక్కేను

మిత్ర పక్షాలు అని మంచిగా దువ్వారు
విగత హస్తాలు వింతగా చూపారు

మన వైపు ఎక్కడ మాట్లాడతారని ఉపరాష్ట్రపతిని చేశారు
ప్రాధేయపడుతున్న ముఖ్యమంత్రులను ప్రదక్షిణలు చేయిస్తున్నారు

ఇది బడ్జెట్ కాదు తెలుగు రాష్ట్రాలలో డెత్ ఆబ్జెక్ట్
                                                  తప్పక చూపిస్తుంది బీజేపీ కి వచ్చే ఎన్నికల్లో దీని ఎఫెక్ట్