Tuesday, January 9, 2018

ప్రాస...




స్వాతంత్రము ని జన్మ హక్కు
అది అందరికి అందేలా చూడడం ఈ సంఘము హక్కు
అది చేతకానప్పుడు నీకు లేదు అధికార కుర్చీలో కూర్చునే హక్కు
ఉత్తనే చెప్పమకు మసి పూసి మారేడు లాంటి కల్ల బొల్లి కాకమ్మల వాక్కు
అంతకన్నా అప్పగించే అర్హుడైన వాడికి ని అధికారపు హక్కు
నీకు చేతకన్నపుడు ఏ మహాత్మో రావాలని ఈ భారతమాతని మొక్కు
భారత మత బానిస దాస్యసృఖాలల ఉక్కు
సంకెళ్ళను తెంచిన వీరులు ఎందరినో స్వాతంత్ర సాధన కోసం ఎక్కు
పెట్టి విలంబు వలె వదిలి చెక్కు
చెదరని ఆత్మవిశ్వాసంతో పరాయి పాలనా చెరశాల నుంచి ముక్కు
పచ్చరాలని తన దేశ యువతభవితకు ఏటువంటి చిక్కు
లేదని కాపాడిన ఆ దేశమాతే సృష్టించుకుంటుంది తన పిల్లలను తమే కాపాడు కునే హక్కు

Saturday, January 6, 2018

మినీ కవితలు...



ఒక విజేత స్వీయచరితము
--------------------
గతించిన గతం అంత ఒక జ్ఞాపకము
వర్తమానము దాని ప్రభావాల కొనసాగింపు
 భవిష్యత్తు ఈ రెండు కలయిక అనుభవం తో పొందే విజయశిఖరం
ఇదే ఒక విజేత స్వీయచరితము
దృక్పథము
---------
చచ్చిపోతున్నా కూడా వైద్యం చేయనివి గవర్నమెంటు ఆసుపత్రులు
 చచ్చిపోయినాక కూడా వైద్యం చేసేవి కార్పొరేట్ ఆసుపత్రులు

చచ్చిపోతున్నా తెలుగుని బ్రతికించాలని ప్రభుత్వపాఠశాలలు
ఎక్కడ బ్రతికేస్తుందో తెలుగు , దానిని ఎలాగైనా చంపేయాలని ప్రయివేటు పాఠశాలలు

ఈ రెండు దృక్పథాలు మారితే గాని ఈ దేశం బాగుపడదు

నేతలు
---------
నవ వసంతానికి
నాంది పలకాలని,
అనుక్షణం శ్రమించిన
నేతలందరికీ వందనం
అభివందనం

నేతలంటే కాదు
నేటి మేటి మేతలు
అధికారం కోసం
అర్రులు చాచే
అక్కుపక్షులు

నేతలంటే వారు
అవకాశం, అధికారం
ఉన్నా ప్రజల కోసం
పోరాటం చేసి
పరమపదించిన వారు
  
 వాస్తవం
-------

నయానో భయానో
నయవంచన

అంగీకరిస్తే అందలం...

ఆజ్ఞను నిరాకరిస్తే
అధ:పాతాళం...

ఇదే నేటి అహంకార
అధికారతత్వం !

Friday, January 5, 2018

సెల్ ఫోన్ నెంబర్

 
మీ సెల్ ఫోన్ నెంబర్ మీ వయసును తెలియజేస్తుంది...నిజమో కాదో మీరే ట్రై చేయండి
ఆశ్చర్యం...నిజంగా ఆశ్చర్యం.

మీ సెల్ ఫోన్ నెంబర్ తో క్రింద వివరించిన విధంగా మీరు కూడా ట్రై చేసి నిజమో కాదో తెలుసుకోండి.

1) మీ సెల్ ఫోన్ నెంబర్లోని చివరి అంకెను తీసుకోండి.

2) దాన్ని 4 తో గుణించండి (x)

3) ఆ మొత్తానికి 48 కూడండి (+)

4) ఈ మొత్తాన్ని 25 తో గుణించండి (x)

5) వచ్చిన మొత్తానికి 818 కూడండి (+)

6) ఆ వచ్చిన మొత్తంలోనుండి మీరు పుట్టిన సంవత్సరాన్ని తీసేయండి (--)

ఇప్పుడు 3 అంకెలు వస్తుంది.....ఆ మూడు అంకెలలోని మొదటి అంకె మీ సెల్ ఫోన్లోని చివరి అంకె, మిగిలిన రెండంకెలు మీ ప్రస్తుత వయసు.......ఆశ్చర్యంగా ఉన్నది కదూ! మీరు కూడ ప్రయత్నం  చేసి ఫార్వర్డ్ చేయండి.